Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనాలో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సినిమా 11,500 థియేటర్లలో విడుదల.. భారీ వసూళ్లు

  • రెండు రోజుల్లోనే రూ.39.85 కోట్లు
  • టాయిలెట్‌ హీరో పేరుతో విడుదల
  • ప్రతిరోజు 56,000 షోలు
బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్‌ నటించిన 'టాయిలెట్‌.. ఏక్‌ థా ప్రేమ్‌ కథ' సినిమా నిన్న చైనాలో విడుదలై అక్కడ కూడా భారీ వసూళ్లు రాబడుతోంది. గతంలో చైనాలో విడుదలైన బాలీవుడ్‌ సినిమాలు హిందీ మీడియం, బజరంగీ బాయిజాన్‌ కంటే ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఏకంగా 11,500 థియేటర్లలో విడుదలైందని, ప్రతిరోజు 56,000 షోలు ఆడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

రెండు రోజుల్లోనే చైనాలో ఏక్‌ థా ప్రేమ్‌ కథ రూ.39.85 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను చైనాలో 'టాయిలెట్‌ హీరో' పేరుతో విడుదల చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి సందేశాత్మక అంశాలు జోడించి ఈ సినిమాను రూపొందించారు. పారిశుద్ధ్యత పెంపొందించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మద్దతుగా అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన భుమి పెడ్నేకర్ నటించారు.


 
China
akshay

More Telugu News